Oct 26, 2013

నక్షత్రాలు - రాశులు

నక్షత్రాలు - రాశులు
      కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.  - అని పురాణ కథ  

క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది. 



అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం 
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం 
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం 
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం 
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య 
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల 
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం 
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః 
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం 
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం 
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం 

ఫలానా సయానికి తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?
             జాతక చక్రం వేయడం తెలుసుకుందామనుకునే వారికి కలిగే మొదటి సందేహం ఇదే అనుకుంటాను. చాలా మందికి విషయం చిన్నప్పటి నుండే తెలిసి ఉంటుంది. కానీ ఇంకా ప్రాథమిక స్థాయికి వెళదామనిపించి విషయం కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నానుఫలానా సయానికి తిథి, వార, నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలాసమాధానం చాలా తేలికైనది. మన తెలుగు కాలెండర్ లో ఉంటాయి వివరాలన్నీ. ఇంకా మంచి పద్ధతి ఏమిటంటే చక్కని పంచాంగం ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవడమేతిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అను ఐదు ( పంచ ) విషయాల ( అంగాల ) గురించి వివరించునదే "పఞ్చాఙ్గము" మన ఆంధ్రులు చంద్రుని బట్టి లెక్కలు వేస్తారు. కనుక మనది చాంద్రమానము.

  
సరే పఞ్చాఙ్గము లలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి గంటల పఞ్చాఙ్గము, ధృక్ ( సూర్య ) సిద్ధాంత పఞ్చాఙ్గముపూర్వంనుండీ వాడేవి గంటల పఞ్చాఙ్గములు. కానీ సరిఅయిన లెక్కలు వచ్చునవి, జ్యోతీష్యులు అంగీకరించునవి ధృక్ సిద్ధాంత పఞ్చాఙ్గములుతిథి, నక్షత్రాలు ఎప్పుడు ప్రారంభమౌతున్నాయి, ఎప్పుడు పూర్తవుతున్నాయి అనే విషయాలలో రెండింటికీ వ్యత్యాసాలు ఉన్నాయి.  ( నేను ఇంకా తెలుసుకోవాలి )

ప్రస్థుతానికి నేను వాడేది ధృక్సిద్ధాంత పంచాగము. అందులో  ‘పిడపర్తి వారి పంచాగముబాగుంటుంది. నేడు దానికి సరిపడు స్థాయిలోకాలచక్రంఅనే పంచాగము కుర్తాళం సిద్ధేశ్వర పీఠ ఆస్థాన సిద్ధాంతి గారైన శ్రీ పొన్నలూరి గార్గేయ దైవఙ్ఞ గారిచే రచింపబడున్నది.

సరే అటువంటి పంచాంగములో ఫలానా తేదీ నాడు తిథి, నక్షత్ర, యోగ, కరణములు ఎంతవరకు ఉన్నదీ అనే విషయం ఉంటుంది. సాధారణంగా అన్ని పంచాంగములలోనూ ప్రారంభ సమయాలు కాక, అంత్య సమయాలు ఇస్తారుఇక వారం విషయం అందరకూ తెలిసినదే! కానీ ఆంగ్ల మానము ప్రకారం అర్థ రాత్రి 12 నుండి మళ్లీ అర్థ రాత్రి 12 వరకు వారము కాదు. సూర్యోదయము నుండి మరల సూర్యోదయము వరకు ఒకటే వారముగా గ్రహించాలి.  అలాగే తిథిని గ్రహించేటప్పుడు పూజలో సంకల్పానికి అయితే సూర్యోదయానికి ఎతిథి ఉంటే అదే తిథిని చెప్పాలి. కానీ ముహూర్త నిర్ణయానికి అయితే ఆసమయానికి ఏది ఉంటే అదే గ్రహించాలి.

తారాబలం చూడటం ఎలా?
   ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం.   చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.

 
1 వస్తేజన్మతారఅలా వరుసగా....
1) జన్మతార,  2) సంపత్తార,  3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార.

ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి 27  నక్షత్రాలకే మన జన్మతారను బట్టి తొమ్మిది పేర్లు అన్వయించాలిఅంటేవిద్యార్థిఅనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుందిమరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి

పైవాటిలో  సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. వృత్తి,వ్యాపార సంబంధమైన విషయాలుసంపత్తారలోనుప్రయాణాది కార్యాలుక్షేమతారలోను, సాధించి తీరాలనుకునే కార్యాలుసాధనతారలోను ప్రారంభించడం మరింత మంచిది.


జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. కొన్నిటికి పనికి రాదు.

చెవులు కుట్టడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషేకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు.

ప్రయాణం, పెండ్లి, క్షౌరము, ఔషధ సేవనం, గర్భాదానం, శ్రార్థం, సీమంతం, పుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు.

ఉదాహరణ రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటేముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటే, రేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి.   అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 నక్షత్రం అవుతుంది. దానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుంది. అంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్ర తార ) అవుతుంది. అంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది.
శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.

తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే .....

ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం
తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ !

ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో ) మెట్ట మొదటి తారను
2 నవకం లో ( 10 నుండి 18 తారలలో ) మూడవ తారను
3 నవకంలో( 19 నుండి 27 తారలలో ) పంచమ తారను
ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు   వదిలి పెట్టవలెను.

అంటే జన్మనక్షత్రము లగాయతు  1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి.

అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి  1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నది. కానీ కావలసిన సమయము లోపల ముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును.  

ఫలానా సమయానికి లగ్నం ఉన్నదో తెలుసుకోవడం ఎలా?
     
                పంచాంగములో తిథి, వార, నక్షత్రాలు ఇచ్చి నట్లే లగ్నాంతకాలములు అని ఒకచోట ఇస్తారు. అవి అంతమయ్యే సమయాన్ని తెలుపుతాయి. ఉదాహరణ: జనవరి 19 తేదీ ఉదయం 06-26 నుండి 08-14 ని. వరకు  మకరలగ్నం ఉంది.

ప్ర : తరువాత ఏలగ్నం?
: ఇంకేమిటి ఉంటుంది? మకరం తరువాత కుంభమే  కదా! :) ఉదయం 09-53 వరకు కుంభలగ్నం ఉన్నది.

ప్ర : ఏలగ్నంతో రోజు ప్రారంభమౌతుంది అనడానికి లెక్కలేమైనా ఉన్నాయా?
: సూర్యుడు ఏరాశిలో ఉంటే లగ్నంతో రోజు ప్రాంరంభమౌతుంది. తరువాత వరుసగా లగ్నాలన్నీ మారుతూ వచ్చి మళ్లీ సూర్యోదయానికి తిరిగి అదే లగ్నంతో ప్రారంభమౌతుంది.

ప్ర : సూర్యుడు ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు? మళ్లీ ఎప్పుడు వేరే రాశిలోకి మారతాడు?
సూర్యుడు సరిగ్గా ముప్ఫైరోజులు ఒక రాశిలో ఉంటాడు. సాధారణంగా ప్రతీనెలా 14 లేక 15 తేదీలలో రాశి మారుతుంటాడు. దీనినే సంక్రమణము అంటాము. అలాధనురాశిలోకి ప్రవేశించి నప్పుడే ధనుస్సంక్రమణం అంటాముఅప్పుడే ధనుర్మాసం ప్రారంభమౌతుంది. తరువాత నెలకి మకర సంక్రమణం ( సంక్రాంతి పండుగ ) వస్తుంది

ముహూర్తం చూడడం ఎలా?

శ్లో// చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాంనిధేః
మూర్తి త్రయ స్వరూపాయ మార్తాండాయ నమోనమః//

          మనం ఒక అధికారి దగ్గరికి పనిమీద వెళ్లేటప్పుడు ఆ అధికారి కోపంలో ఉన్నాడా!?, సంతోషంలో ఉన్నాడా!? మొదలైన   విషయాలు తెలుసుకుని అతను సంతోషంలో ఉన్నప్పుడు వెళితే మన పని త్వరగా అవుతుంది. అలాగే తెలివైన వారు కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకుని మంచి కాలములో తగిన పనులు చేయ తలపెడతారు. అన్నికాలాలూ మనకు జయాన్ని ఇవ్వవు. ఒక సమయంలో ఒకరికి శుభం జరిగితే మరొకరికి కష్టం కలగవచ్చు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు మాత్రమే ప్రత్యేకంగా సరిపడు కాలం తెలుసుకోవాలి. మనం పుట్టిన సమయానికి ఉన్న నక్షత్ర,లగ్న ములను బట్టి మనకు/ మనం తలపెట్టిన పనికి సరిపడు నక్షత్ర, లగ్న సమయాలు తెలుసుకుని ముందడుగు వేయడం జయాన్ని కలిగిస్తుంది.  కాలం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఋషులు మనకు అందించిన అద్భుత వరం “జ్యోతిష్య శాస్త్రం”. దీని ఆధారంగా మన జీవితంలో జరుగు వివాహము, ఉపనయనము, గృహప్రవేశము మొదలైన కర్మలను ఏ రోజు, ఏ సమయంలో జరుపుకోవచ్చో తెలుసుకొనవచ్చు.

ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా ఈ క్రింధి విషయాలు గమనించాల్సి ఉంటుంది.
౧) తారా బలం, ౨) చంద్ర బలం, ౩) లగ్న బలం, ౪) పంచక రహితం, ౫) ఏకవింశతీ మహా దోషాలు
వీటి తో పాటు చివరిగా ఆయా క్రతువులకు పనికి వచ్చే తిథి, వార, నక్షత్రాలనే వాడామా లేదా అనే విషయం కూడా తప్పకుండా నిర్థారించుకోవాలి.

ఉదాహరణకు : మనం అడిగి మరీ పెట్టించుకునే “ఆదివారం”  గృహప్రవేశం, ఉపనయనం, వివాహం మొదలైనవాటికి తగిన వారంగా పేర్కొన బడలేదు. బుధ,గురు, శుక్రవారములు చాలా వరకు శుభకార్యములకు మంచివిగా పెద్దలు తెలిపారు.  అయితే వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథివారములు మధ్యస్థముగా ఉన్ననూ స్వీకరిస్తుంటారు.

  ఒక పని ముఖ్యంగా వైదిక సంబంధమైన వివాహ గృహప్రవేశాది క్రతువులు చేయతలపెట్టినప్పుడు ఈ విషయాలు అన్నీ గమనించి శుద్ధపరచిన శుభముహూర్తములు  గ్రహించాలి. 

పంచకరహితం అంటే?
ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం.


అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును.
అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి.
4
అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు.
6
అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి.
8
అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు.

కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను.

అయితే తప్పని సరి పరిస్థితులలో .....

చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ
అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్ 

అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి.

మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ ములనుపంచకముఅంటారు. ఇవిరహితంచేసుకుని ముహూర్తము నిర్ణయించడాన్నే " పంచక రహితం " అంటారు 

ఉదాహరణ : 19- 01-2012 సా.గం. 17-04  ఏదైనా శుభముహూర్తం నిర్ణయించాలనుకున్నాం.
సమయానికి ( ముహూర్తానికి ) పంచక రహితం అయ్యిందో లేదో చూద్దాం.

తిథి మొదలైనవి పంచాంగంలో చూసుకోవాలి.

19
తేదీ నాడు గురువారం, ఏకాదశి రా. 7.30 వరకు, అనూరాధ నక్షత్రం రా. 7-10 వరకు ఉన్నాయి. రోజు సా. 03-14 నుండి 05-26 వరకు మిథున లగ్నం ఉంది

వారం గురువారం - ఆదివారంనుంచి మొదలుపెడితే  గురువారం ఐదవది. అనగా దీని సంఖ్య 5 అవుతుంది.

తిథి సాయంత్రం 7-30 లోపే మన ముహూర్తం ఉంది కనుక ఏకదశి తిథినే తీసుకోవాలి. తరువాత అయితే ద్వాదశి తిథిని తీసుకోవాలి. ( కొందరు సూర్యోదయానికి ఉన్నతిథినే రోజంతా లెక్కించాలి అంటున్నారు. కానీ అది సరి అయినది కాదు. సమయానికి తిథి ఉంటే అదే తీసుకోవాలి. ) కనుక ప్రస్థుతం ఏకాదశి తిథి. అంటే పాడ్యమి నుండి మొదలు పెడితే ఏకాదశి 11 తిథి అవుతుంది. అనగా దీని సంఖ్య 11 అవుతుంది.

నక్షత్రం అనూరాధఅశ్వని మొదలు అనూరాధ 17 తార. కనుక దీని సంఖ్య 17 అవుతుంది.

లగ్నం మిథునం. మేషం మొదలు మిథునం 3 రాశి కనుక దీని సంఖ్య 3 అవుతుంది.

ఇప్పుడు ఇవన్నీ వరసగా రాసుకుని కూడదాం.

తిథి   +     వారము  +        నక్షత్రములగ్నము
ఏకదశి +    గురువారం +    అనూరాధ +   మిథునం
11     +           5          +       17         +     3           =   36 
దీనిని 9 తో భాగహరించాలి.

           9) 36 ( 4
     
          36
              -----
 
శేషం       0  
            
  -----


సున్నా అంటే 9 గా భావించాలి. తొమ్మిది 'బేసి` సంఖ్యకనుక ముహూర్తానికి పంచక రహితం అయినది.  

చంద్ర బలం
ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటి. ముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్ని నిర్ణయించాలి. ఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండి, ముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి.

జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి
శుక్ల పక్షంలో :  2-5-9
క్రిష్ణ  పక్షంలో :  4-8-12
శుక్లపక్షం, క్రిష్ణ పక్షం రెండిటిలోనూ : 1,3,6,7,10,11 అయితే మంచిది.

అనగా శుక్లపక్షంలో చంద్రుడు  4-8-12 స్థానాలలో ఉంటే ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.
కృష్ణ పక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.

మంత్ర సిద్ది పొంది ,అదిదేవతను,నిర్దిష్ట ఊజ ద్రవ్యాలతో,పూజించే  విదానాన్నితంత్రము అంటారు .సత్పలితాలను పొందటానికి సిద్ది పొందిన గురువు అవసరము ఆదునిక కాలములో పొందే అనేకానేక అవరోదాలు దాటడానికి తంత్ర శాస్త్రం ఎంతో ఉపయోగ పడుతుంది.ఇతరులను బాదించే విదముగా మంత్రాన్ని ఉపయోగించుట మంచిది కాదు .తంత్రము లో పూజ ద్రవ్యాలు అత్యంత కీలక పాత్ర వహిస్తాయి.ఫలం ,పత్రం ,పుష్పం ,తోయం ,ఒషదులు ,దూపం,దీపం ,అక్షతలు ,జపమాల ఆసనం ,మొదలగు పూజ ద్రవ్యాలు శుచిగా శుబ్రంగా బద్రంగా ఉంచాలి .అంతే కాకుండా వివిధ పూజలకు నిర్దేసించి పూజ ద్రవ్యాలనే వాడాలి  తప్ప లబ్యము కాలేదని మనమిష్టమొచిన ద్రవ్యాలను ఉపయోగించరాదు .ఆవిధంగా చేయుట వల్ల  సత్పలితాలకు బదులు దుష్పలితాలే రావచును .దాని వల్ల శాస్త్రం పట్ల అపోహ ,విముఖత కలగా వచును .
తంత్రము అంతే శాస్త్రము కాదు.ఆచరణ విదానము ఏయే ఖర్మలు విదంగా చేయాలో  నిర్దేశిస్తుంది తప్ప బోదన చేయదు .ఆదునిక కాలములోని అప్లైడు సైన్సు వంటిది .ప్రయోగము చేయుటవల్లనే ఫలితం అర్ధమవుతుంది తప్ప పతనము వల్ల ,వినడం వల్ల తంత్రము తెలియ బడదు .ప్రతి మతమందు తంత్ర విదానం ఉంటుంది . తంత్ర విదానం లేని మతమే ఉండదు .విడనములో తేడా  తప్పతంత్రము లేకుండా ప్రపంచములో మతకార్యము కాని ,దైవిక కార్య కలాపము కానీ,ఉండదు అసలీ తంత్రమును శివుడు కైలాస  పర్వతమునందు పార్వతి కి ఉపదేశించినట్లు చెప్పబడింది .చెప్పినప్రతిచోటఅతిరహస్యమైనది,
గోప్యమైనది,అని చెప్పడము వల్ల అనాదిగా గోప్యంగా ఉంచటం వల్ల ప్రజల్లో అనేకానేక భయాలు, సందేహాలుచోటు చేసుకున్నాయి .తంత్రానికి మతముతో సంబందము ఉండదు .ఎవరేమతం పుచుకున్నాతంత్రము సదన తో కూడు కున్నది.తంత్రాన్ని అర్దము చేసుకొనుటకు ప్రయత్నమూ చేయడము వ్యర్ద ప్రయాస .తంత్రాన్ని సాదన చేయాలి .జాతి,వర్ణ ,ప్రాంత ,మత సంబందాల కటితమైనది .మంత్ర శాస్త్రము సాదన ఒకటే దాని పరమ గమ్యం తప్ప మరేది కాదు తంత్రము ద్వారా ప్రాకృతిక శక్తులను మనకు అనుగుణముగా మార్చు కొనుట వల్ల మనకు కావలసిన పనులు చేసుకోన వచును .ప్రకృతి ప్రసాదించిన నీటిని విదముగా త్రాగుటకు ,కరెంటు తాయారు చేయుటకు వ్యేవసయానికి అభిషేకానికి వాడుకొంటమో ఆవిదంగానే తంత్రాన్ని వాడు కోవాలి .
వైదికంగా చెప్పిన మంత్రాలకు ప్రయోగ శీలత లేదా ఆచరణ కలిగించడమే .తంత్ర శాస్త్ర ప్రయోజనం వేల సంవస్చారాల క్రితం నుండి పద్దతులు విదానాలు ప్రతీకలు అమలులో ఉన్నాయో అవే నేటికి ప్రపంచ నలు మూలల్లో వ్యాప్తి చెంది ఉండడమే తంత్ర శాస్త్ర గొప్పతనానికి నిదర్శనము .సంస్కృతంలో అనేక తంత్ర శాస్త్ర గ్రందాలు ఉన్నపటికీ  తంత్ర   శాస్త్రము అభి వృద్ది చెందిందని చెప్ప వచును .
గ్రందస్తమైన విషయము కన్నా ఆచరణ లో ఉన్న విదానాలే తంత్ర శాస్త్రానికి ఆయువు పట్టులు తంత్ర శాస్త్రము ఎప్పుడు ఆచరణ ప్రయోగ వయిద్యము మీదే ఆదారపడి ఉంది కానీ తర్క వితర్కాల మీద పాండిత్య ప్రకర్ష మీద కాదు తంత్ర శాస్త్రము దొంక తిరుగుళ్ళు తిరగ కుండ సరాసరి విషయము మీద కాలునుతుంది కాబట్టి సులువుగా ఉన్నట్లు కనపడు తుంది కానీ అతి కష్టమైనదని కాలు పెట్టాక తెలుస్తుంది.తంత్రములో చెప్పబడిన విషయాలన్నీ ప్రతీకలతో కూడు కొన్నవి .వాటిని అర్ధం చేసుకోక పొతే అపార్దాలుగా కనిపిస్తాయి.అరాదనలో ఉపయోగించే వస్తు జాలమంతా అంతరంగాలలోని అంగలకు ప్రతీకలు సదకుడు తీవ్ర స్తాయి పొంది నప్పుడు ప్రతీకలు ప్రతిమలు పోయి సజీవ రూపాలనే సాధనకు ఉపయోగించాతము జరుగుతుంది .

ఆద్యాత్మిక దిన చర్య (1-11)
5 FEBRUARY 2012 NO COMMENT

మనస్సును ధార్మిక జీవనము మరియు దేవుని వైపు మరల్చుట కు ఆద్యాత్మిక దిన చర్య ఒక కొరడా వంటిది .ఈదిన చర్యను నియమంముగా పాటించిన చొ ప్రశాంత మనస్సు శాంతి కలిగి ఆద్యాత్మిక పదమునందుపురోగమింప గలుగును ప్రతి నిత్యమూ దిన చర్యను పాటించి దాని యొక్క అద్బుత ములగు ఫలితములను అనుభవించుము.
[1]
పడక నుండి ఎపుడు లేచితివి ?
పెందలకడనే పరుండి.పెందలకడ లేచుట వలన మానవుడారోగ్యమును,సంపదను ,మేధా శక్తీ ని పొందును .బ్రంహి ముహుర్తముననే 4 గంటలకు లేచి జప ,ద్యానముల నోనర్చుము . సమయములో ఎక్కువ పరిశ్రమ లేకుండగానే .మనస్సు తనకు తనే ద్యనావాస్త నొందును .
[2 ]
నీవెన్ని గంటలకు నిద్రించితివి ?
ప్రతి వ్యక్తికి 6 గంటల నిద్ర చాలును .10 గంటలకు పరుండి ,వేకువ జామున 4 గంటలకు లెమ్ము .నిద్రాదిక్యము వలన మందత్వము మత్తత ఏర్పడును అదిక నిద్రవలన దేహ క్షీణము ,మేధా శక్తీ దుర్బలత్వము ఏర్పడును.
[3]
యోగమునకు జపమొక ప్రాముక్యమైన అంగమై ఉన్నది . కలియుగములో భగవత్ సాక్షాత్కారము నొందుటకై జప ,కీర్తనడులు అత్యద్బుతమైన సాదనములై యున్నవి.
[4]
ఎంత కాలము కీర్తన మొనరించితివి?
భగవన్నామము పాడుట చే భక్తుడు దివ్యానుభవమును ,దివ్య నహిమను ,దివ్య చైతన్యమును ,తనలోను సర్వత్రానూ కంచగాలుగును . కలియుగములో సంకీర్తన వలన సులబముగా దైవ దర్శనము నొంద వచును .
[5]
ఎన్ని ప్రానయమములోనర్చితివి ?
శ్వాసను అదుపులో నుంచుటకే ప్రాణాయామము అనిపేరు .పొట్ట కాళిగా నున్నపుడు పద్మాసనము,సుకాసనము,సిద్దసనము,లేక సులువుగానున్నఆసనము పై కుర్చోనుము .నేత్రములను మూయుము కూడు ముక్కు రంద్రమును కుడి చేతి బొటన వ్రేలితో మూయుము .ఎడమ ముక్కు రంద్రము ద్వారా శ్వాసను మెల్లగా లోనికి పీల్చు కొనుము .తదుపరి నీ చిటికిన వేలు మరియు ఉంగరపు వ్రేళ్ళతో ఎడమ ముక్కు రంద్రమును మూసివేసి శ్వాసను నీవెంత వరకైతే సుఖ కారముగా ఉంచ గలుగుదువోఅంత వరకు ఆపి ఉంచుము టడు పరి కుడి ముక్కు రంద్రమును తెరచి నిదానముగా శ్వాసను విడచి పెట్టుము విదముగా ముక్కు రంద్రములు మారుస్తూ పీల్చి వదలాలి దీనినే సుఖ ప్రాణాయామము అంటారు దీని వల్ల నాడి సుద్ది జరుగు తుంది .
[6]
ఆసనములు ఎంత కాలమొనర్చితివి ?
అష్టాంగ యోగమునకు ఆసనమే ప్రదమావాస్త అయివున్నది .జప ,ద్యానములోనర్చుటకు పద్మాసన,సిద్దాసన,ములు ఆవస్యకములై ఉన్నవి ఆరోగ్యము నొందుటకై సీర్షాసనము,సర్వాన్గాసనము,పస్చిమోత్తసనము ,మొదలగునవన్నియు నానా విడములైన రోగములను పోగొట్టును
[7]
ఒకే ఆసనము పై ఎంతకాలము ద్యానించితివి?
బ్రంహి మహుర్తమున 4 గంటల నుండి 6 గంటల వరకు నీ ద్యాన గదిలో నీకు సుకమైన ఆసనములో కుర్చుని చేయవలెను ఆసమయములో చేయు ద్యానము పరమో ఉత్క్రుష్ణమైనడి .
[8]
గీతయందు ఎన్ని శ్లోకములు పతిన్చితివి,లేక కన్తస్త మోనర్చితివి?
స్వాదాయమే క్రియా యోగములేక నియమములలో ఒకటై ఉన్నది .స్వాద్యాయము హృదయమును పవిత్రమొనర్చి ,విశాలము ,అత్యున్నతము వికాసవంతమునగు భావములతో నింపి వేయును
[9]
సత్ సంగమునెంత కాల మున్టివి ?
సాదుసత్పురుషులు ,యోగీశ్వరులు మరియు సన్యాసుల యొక్క సాంగత్యముమహిమను గురించి భాగవతము ,రామాయణము ,మొదలగు గ్రందములలో విసేశామముగా వర్ణించ బడినది .మానవుల యొక్కదుష్ట సంస్కారములను నసింప చేయుటకు ఒక్క క్షణ కాల సత్ సంగము మాత్రమే చాలును.
[10]
మవునం ఎన్ని గంటలు అవలంబిన్చితివి?
వ్యర్ద ప్రసంగములతోను ,అతి ప్రసంగములతోను ,మన శక్తీ యంతయు వృధా యగుచున్నది .వ్యర్ధ ప్రసంగాములను వదలి పెట్టి మవునము అవలంబించిన ఇచా శక్తీ వృద్ది యగును వాగ్దోషములను నివారింప జేయును
[11]
నిష్కామ ఖర్మ మెంత వరకు మోనర్చితివి ?
నిష్కామఖర్మ యోగము సమస్త పాపములను ,అపవిత్రను నసింప చేసి ,చ్త్తసుద్దినోనర్చును ,శుద్దమైన మనస్సు కలుగ చేయును ప్రతి దినము కొన్నింటిని పాటించు చుండుము .

21 comments:

  1. nice please send me complete information about astrology. thank you.

    ReplyDelete
  2. జాతక రాసి ని తెలుసుకోవడం ఎలా

    ReplyDelete
  3. Hi Sir Naku Na rasi Ento Teliyadhu Sir meru chepgalara.na birth date vachi 2-12-1988 Sir and arun na name

    ReplyDelete
  4. జాతకం లో దోషాలను నేను ఎలా తోలగిచు కోగలను. నా పుట్టిన తేది 20-11-1972 సోమవారం కార్తీక పౌర్ణమి. కృత్తిక నక్షత్రం పాదం 1.

    ReplyDelete
  5. my birthday 07-09-1973 night 21:15 at nellore. Pl. share my astrology to below mail id. sudhakar.kanna@yahoo.com

    ReplyDelete
  6. ఎప్పటి నుంచో చదువు ఒకే స్ధానంలో ఉండిపోయాను దయ చేసి సలహా ఇవ్వండి నా జననం తేదీ 20.01.1992 పేరు సందీప్ ఉదయం 9.30 నిమిషాలకు జన్మించాను

    ReplyDelete
  7. ఎప్పటి నుంచో చదువు ఒకే స్ధానంలో ఉండిపోయాను దయ చేసి సలహా ఇవ్వండి నా జననం తేదీ 20.01.1992 పేరు సందీప్ ఉదయం 9.30 నిమిషాలకు జన్మించాను

    ReplyDelete
  8. sir you said "అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 వ నక్షత్రం అవుతుంది"
    i did not get how to calculate it
    can u explain it clearly

    ReplyDelete
  9. అయ్యా...! నమస్కారము.

    తమరు ఇక్కడ వుంచిన ఆధ్యాత్మిక దినచర్య 11 పాయింట్లు అత్యద్భుతముగా నున్నవి. ఆచరణ యోగ్యముగా సులభంగా అర్థమయ్యేలాగున కూడా కలవు. అయితే... కాస్తంత అక్షరదోషాల స్థాయి అధికంగా వుండడం కారణం చేసి, నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు సరిచేయడమైనది.

    మీకు వీలునప్పుడు ఒకమారు పరిశీలించి, సబబు అని పిస్తే మార్చగలరు.

    మీ దయ చేత... ఈ దినచర్య యందలి అంశాలను మా సత్సంగ సభ్యులతో కూడా పంచుకొనెదను.

    ధన్యవాదములు

    ReplyDelete
  10. *ఆధ్యాత్మిక దిన చర్య*

    మనస్సును ధార్మిక జీవనము మరియు దేవుని వైపు మరల్చుటకు ఆధ్యాత్మిక దినచర్య ఒక కొరడా వంటిది .ఈ దినచర్యను నియమముగా పాటించినచో ప్రశాంత మనస్సు, శాంతి కలిగి ఆధ్యాత్మిక పథమునందు పురోగమింప వీలగును. ప్రతి నిత్యమూ ఈ దినచర్యను పాటించి దాని యొక్క అద్భుతములగు ఫలితములను అనుభవించుము.

    [1] పడక నుండి ఎపుడు లేచితివి?
    “పెందలకడనే పరుండి, పెందలకడనే నిద్ర లేచుట వలన మానవుడు ఆరోగ్యమును, సంపదను, మేధా శక్తిని పొందును. బ్రాహ్మీ ముహుర్తముననే 4 గంటలకు లేచి జప, ధ్యానముల నొనర్చుము. ఆ సమయములో ఎక్కువ పరిశ్రమ లేకుండగానే, మనస్సు తనకు తానే ధ్యానావాస్థ నొందును.

    [2] నీవెన్ని గంటలకు నిద్రించితివి?
    ప్రతి వ్యక్తికి 6 గంటల నిద్ర చాలును. రాత్రి 10 గంటలకు పరుండి, వేకువ ఝామున 4 గంటలకు లెమ్ము. నిద్రాధిక్యము వలన మందత్వము ప్రమత్తత (నిర్లక్ష్యము) ఏర్పడును. అధిక నిద్రవలన దేహ క్షీణము, మేధాశక్తి దుర్బలత్వము ఏర్పడును.

    [3] యోగమునకు జపమొక ప్రాముఖ్యమైన అంగమైయున్నది. ఈ కలియుగములో భగవత్ సాక్షాత్కారము నొందుటకై జప, కీర్తనాదులు అత్యద్భుతమైన సాధనములై యున్నవి.

    [4] ఎంత కాలము కీర్తన మొనరించితివి?
    భగవన్నామము పాడుటచే భక్తుడు దివ్యానుభవమును, దివ్య మహిమను, దివ్య చైతన్యమును, తనలోనూ, సర్వత్రానూ కాంచ గలుగును. ఈ కలియుగములో సంకీర్తన వలన సులభముగా దైవ దర్శనము నొందవచ్చును.

    [5] ఎన్ని ప్రాణాయామము లొనర్చితివి?
    “శ్వాసను అదుపులో నుంచుట”కే ప్రాణాయామము అని పేరు. పొట్ట ఖాళీగా నున్నప్పుడు పద్మాసనము, సుఖాసనము, సిద్ధాసనము లేక సులువుగా నున్న ఆసనముపై కూర్చొనుము. నేత్రములను మూయుము. కుడి నాసికా రంధ్రమును కుడిచేతి బొటన వ్రేలితో మూయుము. ఎడమ నాసికా రంధ్రము ద్వారా శ్వాసను మెల్లగా లోనికి పీల్చుకొనుము. తదుపరి నీ ఉంగరపు వ్రేలితో ఎడమ ముక్కు రంధ్రమును మూసివేసి శ్వాసను నీవు ఎంత వరకైతే సుఖకరంగా ఉంచ గలుగుదువో అంతవరకు ఆపి ఉంచుము. తదుపరి కుడి నాసికా రంధ్రమును తెరచి నిదానముగా శ్వాసను విడచి పెట్టుము. ఈ విధముగా ముక్కు రంధ్రములు మారుస్తూ... పీల్చి వదలాలి. దీనినే 'సుఖ ప్రాణాయామము' అంటారు. దీనివల్ల నాడీశుద్ధి జరుగుతుంది.

    [6] ఆసనములు ఎంత కాలమొనర్చితివి?
    అష్టాంగయోగమునకు ఆసనమే ప్రథమావాస్థ అయివున్నది. జప, ధ్యానములొనర్చుటకు పద్మాసన, సిద్ధాసనములు ఆవశ్యకములై వున్నవి. ఆరోగ్యము నొందుటకై శీర్షాసనము, సర్వాంగాసనము, పశ్చిమోత్తాసనము మొదలగునవి అన్నియూ... నానా విధములైన రోగములను పోగొట్టును.

    [7] ఒకే ఆసనముపై ఎంతకాలము ధ్యానించితివి?
    బ్రహ్మీ ముహూర్తమున 4 గంటల నుండి 6 గంటల వరకు నీ ధ్యానగదిలో, నీకు సుఖమైన ఆసనములో కూర్చొని చేయవలెను. ఆ సమయములో చేయు ధ్యానము పరమోత్కృష్టమైనది.

    [8] గీతయందు ఎన్ని శ్లోకములు పఠించితివి? లేక కన్ఠస్తమొనర్చితివి?
    స్వాధ్యాయమే క్రియాయోగము లేక నియమములలో ఒకటై యున్నది. స్వాధ్యాయము హృదయమును పవిత్ర మొనర్చి, విశాలము, అత్యున్నతము, వికాసవంతము నగు భావములతో నింపివేయును.

    [9] సత్సంగమున ఎంత కాలము వుంటివి?
    సాధు సత్పురుషులు, యోగీశ్వరులు మరియు సన్యాసుల యొక్క సాంగత్యము మహిమను గురించి భాగవతము, రామాయణము, మొదలగు గ్రంథములలో విశేషముగా వర్ణించబడినది. మానవుల యొక్క దుష్ట సంస్కారములను నశింప చేయుటకు ఒక్క క్షణకాల సత్సంగము మాత్రమే చాలును.

    [10] మౌనం ఎన్ని గంటలు అవలంబించితివి?
    వ్యర్థ ప్రసంగములతోను, అతి ప్రసంగములతోను, మన శక్తి యంతయు వృధా యగుచున్నది. వ్యర్ధ ప్రసంగములను వదలిపెట్టి మౌనము అవలంబించిన ఇచ్ఛాశక్తి వృద్ధియగును, వాగ్దోషములను నివారింప జేయును.

    [11] నిష్కామ కర్మము ఎంత వరకు ఒనర్చితివి?
    నిష్కామ కర్మ యోగము సమస్త పాపములను, అపవిత్రను నసింప చేసి, చిత్తశుద్ధి నొనర్చును, శుద్ధమైన మనస్సు కలుగ చేయును. ప్రతి దినము కొన్నింటిని పాటించు చుండుము.

    ReplyDelete
  11. అయ్య నమస్కారం నాపేరు రాజేష్ (కొంత మంది బాపురెడ్డి అని కూడ పిలుస్తారు) నేను పుట్టిన తేదీ & రోజు నాకు తెలియదు ఇప్పుడు నా జన్మ రాసి & జన్మ నక్షత్రం ఎలా తెలుసుకోవాలి దయ చేసి తెలియజేయండి

    ReplyDelete
    Replies
    1. నామ నక్షత్రం ప్రకారం చిత్త 3 వ పాదం తులా రాశి

      Delete
  12. అంతా పంచరహిత పంచాంగం అనేలాగా చాలా బాగుంది.

    ReplyDelete
  13. అంతా పంచరహిత పంచాంగం అనేలాగా చాలా బాగుంది.

    ReplyDelete
  14. వ్యాసకర్తకు వందనములు. . .నక్షత్రాల కాల వ్యవధిని ఎలా నిర్ణయిస్తారు. ...నక్షత్రానికి . నక్షత్రానికి . .కాల వ్యవధి లో తేడా ఎందుకు

    ReplyDelete
  15. Very good information and explanation. But about lagnas and chandrabalam if some more detailed explanation is given, I may be very much thankful you sir.
    Thanq you very much sir.

    ReplyDelete
  16. ప్రత్యేకం గా నక్షత్రములకు శాంతి కోసం ఏదయినా జప సంఖ్య నిర్దేశించ బడి ఉన్నదా, కాస్త తెలియ జేయ గలరా

    ReplyDelete
  17. నా పేరు శ్రీను నా నక్షత్రం ఏమిటి అండి

    ReplyDelete
  18. నమస్కారం అయ్యా, నా పేరు పకీరప్ప, సర్టిఫికెట్ (13-06-1965)జాతకం చెప్పగలరు

    ReplyDelete